కారును శుభ్రంగా ఉంచలేదని డ్రైవరుపై ఎస్పీ దాడి

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

కారును శుభ్రంగా ఉంచలేదని డ్రైవరుపై ఎస్పీ దాడి

సీఎం ఆదేశాలతో బదిలీ వేటు
ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

నారాయణ్‌పుర్‌: కారును శుభ్రంగా ఉంచనందుకు డ్రైవరుగా ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎస్పీపై బదిలీ వేటు పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌లో జరిగింది. ఆ జిల్లా ఎస్పీ ఉదయ్‌ కిరణ్‌ వద్ద ప్రభుత్వ వాహన డ్రైవరుగా ఎస్టీ వర్గానికి చెందిన కానిస్టేబుల్‌ జైలాల్‌ నేతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే కారును శుభ్రంగా ఉంచలేదన్న కారణంతో ఎస్పీ తనను తీవ్రంగా కొట్టారని, దీంతో తాను సరిగా నడలేకపోతున్నానని నేతం సోమవారం ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. అనంతరం నేతం ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తీవ్రంగా పరిగణించారు. ఉదయ్‌ కిరణ్‌ను తక్షణం బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆయన్ను రాయ్‌పుర్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాను నేతంపై దాడి చేయలేదని, కేవలం మందలించానని ఉదయ్‌ కిరణ్‌ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన