బంగ్లాదేశ్‌లో ముదిరిన హింస

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 10:37 IST

బంగ్లాదేశ్‌లో ముదిరిన హింస

హిందువుల ఇళ్లపై మూక దాడులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలు మరింత తీవ్రరూపు దాల్చాయి. దుర్గ పూజ వేడుకల సమయంలో రేగిన కలహాలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం రాత్రి మైనార్టీలైన హిందువులకు చెందిన ఇళ్లపై 100 మందికిపైగా ఛాందసవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 66 ఇళ్లు ధ్వంసం కాగా, 20 గృహాలు దగ్ధమయ్యాయి. కొన్నిరోజులుగా హిందూ దేవాలయాలు, ఆస్తులపై కొనసాగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులు దేశవ్యాప్త నిరసనలు కొనసాగిస్తుండగానే మళ్లీ మరో హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడుల్లో 20 ఇళ్లతో పాటు రెండు గోదాములు, 20 గడ్డివాములు దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పాల్సి వచ్చింది.

తాజా ఘటనపై హిందువులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన