కొవాగ్జిన్‌ టీకాపై మరొక్క సమాచారం అందాలి

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 05:26 IST

కొవాగ్జిన్‌ టీకాపై మరొక్క సమాచారం అందాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

ఐరాస/జెనీవా: భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాపై మరొక్క సమాచారం రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు దాని పనితీరు, భద్రతను పూర్తిస్థాయిలో విశ్లేషించాల్సి ఉంటుందని ట్వీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తాము అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి డబ్ల్యూహెచ్‌వోకు ఏప్రిల్‌ 19న దరఖాస్తు చేసుకుంది. ‘‘మా నిపుణులు కోరుతున్న సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ అందజేస్తూ వస్తోంది. దానిని విశ్లేషిస్తూ అవసరమైన వివరాలు కోరుతున్నాం. ఇప్పుడు అదనంగా మరొక్క సమాచారం రావాల్సి ఉంది’’ అని డబ్ల్యూహెచ్‌వో ఆ ట్వీట్‌లో పేర్కొంది. కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ విషయమై సాంకేతిక నిపుణుల బృందం ఈ నెల 26న భేటీ కాబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్‌ వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన