నిహంగ్‌ నేతతో తోమర్‌ ఫొటోపై రగడ

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:18 IST

నిహంగ్‌ నేతతో తోమర్‌ ఫొటోపై రగడ

సింఘు సరిహద్దుల్లో ప్రణాళిక ప్రకారమే హత్య జరిగి ఉండొచ్చు
పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి రంధావా అనుమానం

చండీగఢ్‌: దిల్లీలోని సింఘు సరిహద్దుల్లో ఇటీవల దళిత కార్మికుడు లఖ్‌బిర్‌ సింగ్‌ దారుణ హత్యకు గురవ్వడంపై పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రణాళిక ప్రకారమే ఎవరైనా ఈ హత్యను చేయించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లఖ్‌బిర్‌ను చంపినవారిని సమర్థిస్తూ మాట్లాడిన ఓ నిహంగ్‌ (సిక్కుల్లోని ఓ వర్గం) నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఓ బృంద ఫొటోలో కలిసి ఉండటాన్ని రంధావా ప్రశ్నించారు. ఆ ఫొటో పలు అనుమానాలకు తావిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిండికి కూడా డబ్బుల్లేని లఖ్‌బిర్‌ సింఘు సరిహద్దు వరకు ఎలా వెళ్లాడో తేల్చాల్సిందిగా స్థానిక అధికారులను తాను ఆదేశించినట్లు తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన