పంట వ్యర్థాల దహనం.. పర్యావరణ హననం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:20 IST

పంట వ్యర్థాల దహనం.. పర్యావరణ హననం

ఉద్గారాల విడుదల భారత్‌ నుంచే అత్యధికం
వెల్లడించిన ‘బ్లూ స్కై అనలిటిక్స్‌’ నివేదిక

దిల్లీ: పంట వ్యర్థాల దహనం ద్వారా వెలువడుతున్న ఉద్గారాలకు సంబంధించి భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఓ సంస్థ ఆందోళనకర విషయం బయటపెట్టింది. 2015-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఉద్గారాల్లో భారత్‌ వాటా 13 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐఐటీ పూర్వ విద్యార్థిని అభిలాష పుర్వర్‌ స్థాపించిన అంకుర సంస్థ బ్లూ స్కై అనలిటిక్స్‌ ఈ వివరాలను విడుదల చేసింది. వాతావరణ మార్పులపై అధ్యయనం చేసే క్లైమేట్‌ ట్రేస్‌ సంస్థతో కలిసి బ్లూ స్కై అనలిటిక్స్‌ పనిచేస్తోంది. పంట వ్యర్థాల దహనం, అడవులను కాల్చివేయడం లాంటి మానవ చర్యల ద్వారా ఏర్పడిన మంటలతో పాటు కార్చిచ్చుల్లాంటి ప్రకృతి ప్రేరేపిత మంటల ద్వారా విడుదలవుతున్న ఉద్గారాలపై ఈ సంస్థ అధ్యయనం చేస్తోంది. భారత్‌లో పంట వ్యర్థాల దహనం ద్వారా వెలువడుతున్న ఉద్గారాల శాతం క్రమంగా తగ్గుతున్నట్లు ఈ సంస్థ పరిశీలనలో తేలింది. 2016 నుంచి 2019 మధ్య అందులో 11.39 శాతం తగ్గుదల నమోదైనట్లు వెల్లడైంది. అయితే 2019-20లో అది 12.8 శాతం మేర పెరగడం గమనార్హం. దీంతో ఆ ఏడాది ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో భారత్‌ వాటా 12.2 శాతంగా నమోదైంది. ఉద్గారాలకు సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలు, నిర్దిష్ట సమాచారం అందించడమే లక్ష్యంగా క్లైమేట్‌ ట్రేస్‌, బ్లూ స్కై అనలిటిక్స్‌ పనిచేస్తున్నాయి. దీనికోసం కార్చిచ్చులు, పంట వ్యర్థాల దహనాలకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు, మ్యాపుల సాయంతో సేకరించిన సమచారాన్ని క్రోడీకరించి జాబితాలను విడుదల చేస్తున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన