ఇతర కరోనా వైరస్‌ల నుంచీ రక్షణ

ప్రధానాంశాలు

Updated : 20/10/2021 06:07 IST

ఇతర కరోనా వైరస్‌ల నుంచీ రక్షణ

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: మీరు ఇప్పటికే కొవిడ్‌ను జయించారా? లేదంటే వ్యాక్సిన్‌ తీసుకున్నారా? అయితే, కరోనా కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌ల నుంచీ మీకు రక్షణ లభిస్తుందంటున్నారు... నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! సార్స్‌కొవ్‌-2 వైరస్‌ సోకిన కారణంగా, లేదంటే టీకా తీసుకున్నందు వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు... ఇతర కరోనా వైరస్‌లను ఎంతవరకూ ఎదుర్కొంటాయన్న విషయమై వారు పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. ‘‘కరోనా జాతికి చెందిన 3 ప్రధాన వైరస్‌లు మనిషిని ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తాయి. అవి: సార్స్‌కొవ్‌-1 (సార్స్‌), సార్స్‌కొవ్‌-2 (కొవిడ్‌-19), ఓసీ43 (మెర్స్‌). కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు సార్స్‌కొవ్‌-1 నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్టు గుర్తించాం. సార్స్‌కొవ్‌-1, 2 రకాలు 70% ఒకేలా ఉండటమే ఇందుక్కారణం. సాధారణ జలుబుకు కారణమయ్యే ఓసీ43 వైరస్‌ల నుంచ్కీచీజి కొవిడ్‌ వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. కాకపోతే అంత సమర్థంగా మాత్రం కాదు. అన్నిరకాల కరోనా వైరస్‌ల నుంచి మానవాళికి రక్షణ కల్పించే సార్వత్రిక టీకా తయారీకి మా పరిశోధన దోహదపడగలదు’’ అని ప్రొఫెసర్‌ పాబ్లో పెనలోజా-మ్యాక్‌మాస్టర్‌ పేర్కొన్నారు. క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన