లఖింపుర్‌ హింసపై సుప్రీంకోర్టు విచారణ నేడు

ప్రధానాంశాలు

Updated : 20/10/2021 06:06 IST

లఖింపుర్‌ హింసపై సుప్రీంకోర్టు విచారణ నేడు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఈ నెల 3న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది. నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ వివాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ నెల 8న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్టు అయ్యారు. వీరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశీష్‌ మిశ్ర కూడా ఉన్నారు. ప్రదర్శనగా వెళుతున్న రైతులపైకి వాహనాన్ని నడిపి నలుగురు రైతులు, ఒక పాత్రికేయుడి మృతికి, తదనంతర దాడిలో మరో ముగ్గురు చనిపోవడానికి దారితీసిన ఈ కేసుపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని, సీబీఐని కూడా దానిలో భాగస్వామిని చేయాలని ఇద్దరు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరపనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన