భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్‌

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:26 IST

భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్‌

ఇస్లామాబాద్‌: తమ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించబోయిన భారత జలాంతర్గామిని అడ్డుకొన్నామని పాకిస్థాన్‌ సైన్యం మంగళవారం వెల్లడించింది. ఈ నెల 16న ఈ ఘటన జరిగిందని, సముద్ర గస్తీ విధులు నిర్వర్తించే తమ దేశ నేవీ విమానం(లాంగ్‌ రేంజ్‌ మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) భారత జలాంతర్గామిని గుర్తించి హెచ్చరికలు చేయడంతో అది వెనక్కు మళ్లిందని పాకిస్థాన్‌ ఆర్మీ ఆ ప్రకటనలో పేర్కొంది. భారత జలాంతర్గాములు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించేందుకు యత్నించడం ఇది మూడోసారని తెలిపింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన