న్యూయార్క్‌ కోర్టులోనూ నీరవ్‌ మోదీకి ఎదురుదెబ్బ

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:29 IST

న్యూయార్క్‌ కోర్టులోనూ నీరవ్‌ మోదీకి ఎదురుదెబ్బ

వాషింగ్టన్‌: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో భారతదేశం నుంచి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(50)కి న్యూయార్క్‌ కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీల పేరుతో మోసం చేసినట్టు తమపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలంటూ నీరవ్‌ మోదీతోపాటు ఆయన సహాయకులు మిహిర్‌ భన్సాలీ, అజయ్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇక్కడి కోర్టు తిరస్కరించింది. నీరవ్‌ మోదీ గతంలో పరోక్షంగా యాజమాన్య బాధ్యతలు నిర్వహించిన మూడు అమెరికా కంపెనీలకు ట్రస్టీగా రిచర్డ్‌ లెవిన్‌ను కోర్టు నియమించింది. ఈయనే నీరవ్‌ బృందంపై కోర్టులో అభియోగాలు చేశారు. పై ముగ్గురి వల్ల జరిగిన నష్టానికి కనీస పరిహారం కింద రూ.112.6 కోట్లు (15 మిలియన్‌ డాలర్లు) ఇప్పించాలంటూ రిచర్డ్‌ లెవిన్‌ కోర్టును అభ్యర్థించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌ జైలులో ఉన్నారు. నీరవ్‌ను అప్పగించాలని భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన