భారత్‌పై కాట్సా ఆంక్షలు వద్దు

ప్రధానాంశాలు

Published : 28/10/2021 04:59 IST

భారత్‌పై కాట్సా ఆంక్షలు వద్దు

బైడెన్‌కు ఇద్దరు సెనేటర్ల వినతి

వాషింగ్టన్‌: రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసినా భారత్‌పై కఠినమైన ‘ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల నిరోధక చట్టం (కాట్సా)’ కింద ఆంక్షలు విధించొద్దని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ను ఇద్దరు ప్రముఖ సెనేటర్లు కోరారు. అమెరికా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో భారత్‌కు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన మార్క్‌ వార్నర్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత జాన్‌ కార్నిన్‌ మంగళవారం ఈ విషయంపై బైడెన్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘‘రష్యా నుంచి రక్షణ సామగ్రి కొనుగోలును భారత్‌ ఇటీవల గణనీయంగా తగ్గించింది. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే.. 2016-2020 మధ్య ఆ దేశానికి రష్యా ఆయుధాల ఎగుమతి 53% మేర తగ్గింది. అదే సమయంలో అమెరికా నుంచి రక్షణ సామగ్రి కొనుగోలును భారత్‌ భారీగా పెంచింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 340 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను మన నుంచి కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో కాట్సా ఆంక్షలు విధిస్తే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ముప్పుంది.  కాబట్టి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేయాలన్న భారత ప్రణాళికలకు కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపునివ్వండి’’ అని అందులో పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన