సురక్షిత మార్గంలో స్థూలకాయానికి చెక్‌

ప్రధానాంశాలు

Published : 28/10/2021 09:14 IST

సురక్షిత మార్గంలో స్థూలకాయానికి చెక్‌

హ్యూస్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మంది మరణానికి కారణమవుతున్న అధిక బరువు/స్థూలకాయ సమస్యను జీవనశైలి మార్పులు, సురక్షిత చికిత్సలతో పరిష్కరించవచ్చని అమెరికా నిపుణులు పేర్కొన్నారు. స్థూలకాయ సమస్యను ఎదుర్కోవడంపై బోస్టన్‌కు చెందిన బేత్‌ ఇజ్రాయెల్‌ డీకొనెస్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. ‘‘స్థూలకాయానికి కారణమవుతున్న జన్యు, హార్మోన్‌ కారకాల గురించి ఇన్నాళ్లూ సరైన అవగాహన ఉండేది కాదు. ఆధునిక పరిశోధనలతో వీటి గుట్టు వీడుతోంది. దీంతో అధిక బరువును తగ్గించే మెరుగైన చికిత్సల రూపకల్పన సాధ్యమవుతోంది. బేరియాట్రిక్‌ సర్జరీతో సమస్యను 40% వరకూ తగ్గించవచ్చు. ఈ శస్త్రచికిత్స కొందరిలో వికటించవచ్చు. లక్షిత శరీర భాగాలకు ఔషధాన్ని చేరవేసే విధానాలు, సురక్షితమైన జన్యు చికిత్సలు, జీర్ణాశయాంతర హార్మోన్లతో రూపొందించిన వైద్య విధానాలు స్థూలకాయ సమస్యను గణనీయంగా పరిష్కరించే అవకాశముంది. వీటితో దుష్ప్రభావాలు అంతగా ఉండవు’’ అని పరిశోధనకర్త క్రిస్టోస్‌ మంజోరస్‌ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన