స్మృతి ఇరానీపై కేసులో 3న తీర్పు

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

స్మృతి ఇరానీపై కేసులో 3న తీర్పు

సుల్తాన్‌పుర్‌: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నవంబరు 3న తీర్పు వెలువరించనుంది. అంతర్జాతీయ షూటర్‌ వార్తిక సింగ్‌ ఈ దావా వేశారు. కేంద్ర మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవి ఇవ్వడానికి ఆమెతో పాటు, విజయ్‌ గుప్త, రజనీశ్‌ సింగ్‌లు డబ్బులు డిమాండు చేశారని ఆరోపించారు. తనను సభ్యురాలిగా నియమించినట్టు నకిలీ ధ్రువపత్రం కూడా ఇచ్చారని తెలిపారు. దీనివల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని, అందువల్ల రూ.కోటి చెల్లించాలని డిమాండు చేశారు. ఆ మొత్తాన్ని చివరకు రూ.25 లక్షలకు తగ్గించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన