IPL 2021: ఆర్సీబీ జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లు..

కథనాలు

Published : 21/08/2021 19:24 IST

IPL 2021: ఆర్సీబీ జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లు..


 

ఇంటర్నెట్ డెస్క్‌: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లు చేరనున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా స్థానాన్ని శ్రీలంక ఆల్‌రౌండర్‌ వానిండు హసరంగ భర్తీ చేయనుండగా.. డానియల్‌ సామ్స్‌ స్థానంలో శ్రీలంక పేసర్‌ దుష్మంత చమీరా,  ఫిన్‌ అలెన్‌ స్థానంలో సింగపూర్‌ ఆల్‌రౌండర్‌  టిమ్‌ డేవిడ్‌  జట్టులోకి రానున్నారు.

ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇటీవల శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో వానిండు హసరంగ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఇక, టిమ్‌ డేవిడ్ విషయానికొస్తే.. బిగ్‌బాష్ లాంటి టోర్నీలు ఆడిన అనుభవం ఉంది. యూఏఈ వేదికగా వచ్చేనెల 19న ఐపీఎల్ 14 పున:ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన