Sourav Ganguly: మరో 3 జన్మల్లోనూ నేనిలాగే..!

కథనాలు

Published : 19/05/2021 19:54 IST

Sourav Ganguly: మరో 3 జన్మల్లోనూ నేనిలాగే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు! తన తర్వాతి మూడు జన్మల్లోనూ నీలిరంగు జెర్సీలో క్రికెట్‌ ఆడాలని కోరుకున్నాడు. బుధవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిత్రాన్ని పంచుకున్నారు.

ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లు, సారథుల్లో గంగూలీ ఒకరన్న సంగతి తెలిసిందే. 1992 నుంచి 2008 వరకు దాదా 424 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. 41.46 సగటుతో 18,575 పరుగులు చేశారు. 38 శతకాలు బాదేశారు. అవసరమైనప్పుడు బంతితోనూ ఆదుకున్నారు. 132 వికెట్లు పడగొట్టారు. కెరీర్లో 228 మ్యాచుల్లో సారథ్యం వహించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపారు. అంతేకాకుండా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో డీలా పడ్డ టీమ్‌ఇండియాలో ధైర్యం నింపి దూకుడు నేర్పారు. ఆటకు వీడ్కోలు పలికాక క్రికెట్‌ పాలనలోనూ రాణిస్తున్నారు.

‘మరో మూడు జన్మల్లోనూ నేనిదే చేయాలని అనుకుంటున్నాను’ అని దాదా తన మనసులోని కోరికను బయటపెట్టారు. నీలిరంగు జెర్సీ ధరించి సొగసరి లాఫ్టెడ్‌ షాట్ కొట్టిన చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. 2007లో పాక్‌పై అతడు చివరి వన్డే ఆడాడం గమనార్హం. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడుగా పనిచేస్తున్న గంగూలీకి కొన్నాళ్ల క్రితం గుండెనొప్పి రావడంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన