మిస్‌టీన్‌ తెలుగు యూనివర్స్‌గా నిత్యాకొడాలి
మిస్‌టీన్‌ తెలుగు యూనివర్స్‌గా నిత్యాకొడాలి

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రతిష్ఠాత్మక ‘మిస్‌ టీన్‌ తెలుగు యూనివర్స్‌’ 2020  కిరీటం తెలుగు అమ్మాయి నిత్యా కొడాలిని వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకోవటం కోసం నలభైకి పైగా దేశాలకు చెందిన దాదాపు 800మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో తొలిస్థానం దక్కించుకున్న పదిహేనేళ్ల నిత్యా అమెరికాలో జన్మించారు. ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంస్థతో పాటు, మరో వందకి పైగా తెలుగు సంస్థలు ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. తెలుగు భాషా పరిజ్ఞానం, సామాజిక సేవా దృక్పథం, విద్యా, నృత్యం ఇతర సాంస్కృతిక కళల్లో విశేష ప్రతిభ కనబరిచిన నిత్యా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఘనత సాధించటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెయింటింగ్, పియానో వంటివి తనకెంతో ఇష్టమైన పనులని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినట్లు వివరించారు. గత రెండు సంవత్సరాలుగా వాలంటీర్‌గా పనిచేస్తూ చాలామంది పిల్లలకు తెలుగు రాయటం, చదవటం నేర్పిస్తున్నట్లు తెలిపారామె. భవిష్యత్తులో డాక్టర్‌ కావాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు.

 


Advertisement


మరిన్ని