కాల్పుల్లో మరణించిన వారిలో నలుగురు సిక్కులు
కాల్పుల్లో మరణించిన వారిలో నలుగురు సిక్కులు

వాషింగ్టన్‌: అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. అందులో నలుగురు భారత సంతతికి చెందిన సిక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి ఇండియానాపొలిస్‌లోని ఫెడెక్స్‌ సదుపాయాల కార్యాలయం వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో భారత సంతతి సిక్కులు అమర్‌జిత్‌ జోహల్‌ (66), జస్విందర్‌ కౌర్‌ (64), అమర్‌జిత్‌ స్కోన్‌ (48), జస్విందర్‌ సింగ్‌ (68) మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో హర్‌ప్రీత్‌ గిల్‌ అనే సిక్కు వ్యక్తి ఉన్నాడు. దాడి అనంతరం ఆ సాయుధుడు కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. అతడిని బ్రాండన్‌ హోలే (19)గా పోలీసులు గుర్తించారు.

సిక్కుల మృతి పట్ల విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ దాడి షాక్‌కు గురిచేసింది. సిక్కుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. చికాగోలోని మా కాన్సులేట్ జనరల్ ఇండియానాపొలిస్‌లోని మేయర్, స్థానిక అధికారులతో పాటు సిక్కు సంఘం నాయకులతో సంప్రదిస్తున్నారు. మాకు సాధ్యమయ్యే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం’ అని ఆయన తెలిపారు.

Advertisement

Advertisement


మరిన్ని