ఆయిషా షాకు శ్వేతసౌధంలో ఉన్నత పదవి
ఆయిషా షాకు శ్వేతసౌధంలో ఉన్నత పదవి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు ఉన్నత పదవి దక్కింది. కశ్మీరుకు చెందిన ఆయిషా షాను తన డిజిటల్‌ విధానాలకు సంబంధించి ‘వైట్ హౌజ్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ’ పార్ట్‌నర్‌షిప్స్‌ మేనేజర్‌గా నియమిస్తున్నట్టు కాబోయే అధ్యక్షుడు ప్రకటించారు. డైరక్టర్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ రాబ్‌ ఫ్లాషిర్టీ నేతృత్వం వహించనున్న బృందంలో ఆమె విధులు నిర్వహిస్తారు.

భారత్‌లోని కశ్మీరులో పుట్టిన ఆయిషా షా, అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో పెరిగారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె బైడెన్‌-హ్యారిస్‌ క్యాంపెయిన్‌కు డిజిటల్‌ వ్యవహారాల నిర్వాహకురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ స్మిత్సోనియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు జాన్‌ ఎఫ్‌ కెనెడీ సెంటర్‌ ఫర్‌ ద పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేశారు.

‘‘వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన ఈ బృందం..  మరింత నూతన, సృజనాత్మక విధానాలతో డిజిటల్‌ వ్యూహరచన ద్వారా శ్వేతసౌధాన్ని, అమెరికన్‌ ప్రజలకు మరింత దగ్గర చేయగలదు.  అమెరికాను గతంలో మాదిరిగా ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో  వీరందరూ ఉమ్మడిగా భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నాను. వీరు నా యంత్రాంగంలో సభ్యులైనందుకు నాకు చాలా ఉద్వేగంగా ఉంది.’’ అని బైడెన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

(Image courtesy: Linkedin)

ఇవీ చదవండి..

బైడెన్‌ దారిలో భారత సంతతి వైద్యులు

అమెరికాలో మరిన్ని చీకటి రోజులు

Advertisement

Advertisement


మరిన్ని