వారి హృదయాల్లో బాలు ఎప్పటికీ నిలిచిపోతారు
వారి హృదయాల్లో బాలు ఎప్పటికీ నిలిచిపోతారు

ఆల్బర్టా: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరమని కెనడాలోని ఆల్బర్టా రాష్ట్ర మంత్రి శివలింగ ప్రసాద్‌ పండా అన్నారు. ఐదు దశాబ్దాలుగా దేశ విదేశాల్లో ఎస్పీ బాలు చూపించిన ప్రతిభను ఆయన కొనియాడారు. నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టి్స్టుగా సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బాలు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 


మరిన్ని