ఆస్టిన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
ఆస్టిన్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

ఆస్టిన్‌: తెలంగాణతో పాటు బతుకమ్మ సంబురాలు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో తెలుగు మహిళలంతా ఒక దగ్గర చేరి బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణతో ముస్తాబైన మహిళలంతా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 

Advertisement

Tags :

మరిన్ని