బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లండన్‌‌: తెలంగాణ యూరప్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (టెకా) ఆధ్వర్యంలో బ్రిటన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రవాస తెలంగాణ ప్రజలు వర్చువల్‌ పద్ధతిలో ఈ వేడుకలు జరుపుకొన్నారు. కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో సందడి చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో రోజూ వివిధ రకాల బతుకమ్మలను పేర్చారు. వీటి ప్రాముఖ్యతను పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆలపించిన బతుకమ్మ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంప్రదాయ వస్త్రధారణలో అంతా సందడి చేశారు. ఆన్‌లైన్‌లో బతుకమ్మ చేసుకుంటామని ఎవరమూ ఊహించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అంతా కలిసికట్టుగా నిలబడి ఈ వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని టెకా ప్రతినిధులు తెలిపారు. ఎంత దూరం వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకూడదనే ఉద్దేశంతోనే వేడుకలు జరుపుకొన్నట్టు వివరించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.మరిన్ని