టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

టోక్యో‌: విదేశాల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టోక్యోలోని ఫునబోరి పార్కులో శనివారం తెలుగు మహిళలంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మను పేర్చారు. ఆటపాటలతో సందడి చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషంగా వారు తెలిపారు.

Advertisement


మరిన్ని