బైడెన్‌ అత్యుత్తమ అధ్యక్షుడిగా ఉంటారు: కమల
బైడెన్‌ అత్యుత్తమ అధ్యక్షుడిగా ఉంటారు: కమల

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ అత్యుత్తమ అధ్యక్షుడిగా, ప్రపంచం గర్వించే నాయకుడిగా ఉంటారని ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ అన్నారు. 78 ఏళ్ల బైడెన్‌ను ఆమె ప్రశంసించారు. ఆయన అమెరికన్లందరికీ అధ్యక్షుడని చెప్పుకొచ్చారు. 

‘బైడెన్ అత్యత్తమ అధ్యక్షుడిగా ఉంటారు. ప్రపంచం ఆయన్ను గౌరవిస్తుంది. మన తరవాతి తరం దాన్ని చూడగలదు’ అని కమల ట్వీట్ చేశారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్య పదవికి ఎన్నికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన మొదటి అమెరికా నల్లజాతీయురాలామె. 

ఇదిలా ఉండగా.. జోబైడెన్ వరస ట్వీట్లలో దేశ ఐక్యతకు పిలుపునిచ్చారు. ‘దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించేందుకు మన సమయం వచ్చింది. వైరస్‌ వ్యాప్తిని తగ్గుముఖం పట్టేలా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం లెక్కలోకి వస్తుంది. ప్రతి నిర్ణయం జీవితాన్ని కాపాడుతుంది. వైరస్‌పై పోరాటంలో మనల్ని మనం తిరిగి సమాయత్తం చేసుకోవాల్సి ఉంది’ అంటూ వరస ట్వీట్లు చేశారు. 

Advertisement

Advertisement


మరిన్ని