థన్‌బర్గ్‌ మద్దతు ఎవరికంటే!
థన్‌బర్గ్‌ మద్దతు ఎవరికంటే!

పర్యావరణ పోరాటంలో అమెరికా ఎన్నికలు కీలకమన్న పర్యావరణ ప్రేమికురాలు

స్టాక్‌హోం: పర్యావరణ మార్పులపై చేస్తున్న పోరాటానికి అమెరికా ఎన్నికలు అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ అభిప్రాయపడ్డారు. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు ఆమె మద్దతు ప్రకటించారు. అమెరికా ఓటర్లంతా ఆయన్నే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలపై థన్‌బర్గ్‌ నేరుగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. 

పర్యావరణ మార్పులపై గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న థన్‌బర్గ్‌ పలు అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ నిలదీశారు. ఓసారి ఐరాసలో ప్రసంగిస్తూ.. పర్యావరణానికి ముప్పు కలిగించే నిర్ణయాలతో పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి ఎంత ధైర్యం అంటూ ప్రపంచ దేశాల నాయకులను ప్రశ్నించారు.

ట్రంప్‌ తొలి నుంచి థన్‌బర్గ్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోపాన్ని నియంత్రించుకోవాలంటూ ఓ సందర్భంలో ఆమెకు సూచించారు. మరోవైపు బైడెన్‌ ఆమె పోరాటానికి మద్దతు ప్రకటించారు. బైడెన్‌కు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. గత నెల ప్రముఖ మ్యాగజైన్‌ ‘సైంటిఫిక్‌ అమెరికన్‌’ సైతం ఆయనకు మద్దతు ప్రకటించింది. బైడెన్‌కు ఓటేయాలంటూ పాఠకులకు బహిరంగంగా పిలుపునిచ్చింది.

Advertisement

Advertisement


మరిన్ని