బ్రిటన్‌ మహారాణి హనీమూన్‌ ఫొటో.. చూశారా!
బ్రిటన్‌ మహారాణి హనీమూన్‌ ఫొటో.. చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ రాజ దంపతులు క్వీన్‌ ఎలిజబెత్‌, డ్యూక్‌ ఫిలిప్‌ స్థానిక కాలమానం ప్రకారం గురువారం 73వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ దంపతులకు చెందిన కొన్ని ఆసక్తికర చిత్రాలను అధికారులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కాగా వాటిలో ఒక చిత్రం అభిమానులు, బ్రిటన్‌ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది.

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌, డ్యూక్‌ ఆఫ్ ఎడింబరో ఫిలిప్‌ల వివాహం నవంబర్‌ 20, 1947 లో జరిగింది. అనంతరం వారు తమ హనీమూన్‌ కోసం హాంప్‌షైర్‌లోని బ్రాడ్‌ల్యాండ్స్‌కు వెళ్లారు. ఆ సందర్భంలో తీసిన ఓ నలుపు-తెలుపుల చిత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. గతకాలపు స్మృతులను గుర్తు చేసే ఈ చిత్రం.. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే ఆరు లక్షలకు పైగా లైక్‌లను స్వంతం చేసుకుంది. మరో తాజా చిత్రంలో తన ముని మనుమలు, ప్రిన్స్‌ విలియం సంతానం ప్రిన్స్‌ జార్జి, ప్రిన్సెస్‌ ఛార్లొట్టె, ప్రిన్స్‌ లూయీలు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్‌ కార్డును.. మహారాజ దంపతులు మురిపెంగా చూడటం కూడా పలువురిని ఆకర్షిస్తోంది.


మరిన్ని