ఆ దేశాధినేతకు భారతీయ రుచులంటే ఇష్టం!
ఆ దేశాధినేతకు భారతీయ రుచులంటే ఇష్టం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఆహారాన్ని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వివిధ దేశాల్లో భారతీయ రెస్టారెంట్లు లాభసాటి వ్యాపారంతో దూసుకుపోవటమే ఇందుకు నిదర్శనం. కాగా, భారతీయ ఆహారమంటే లొట్టలేసే వారి జాబితాలోకి తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌ కూడా చేరటం విశేషం. తనకు భారతీయ వంటకాలు అంటే చాలా ఇష్టమని.. తమ దేశంలో భారతీయ రెస్టారెంట్లు ఉండటం అదృష్టమని కూడా ఆమె పొగిడేశారు.

‘‘తైవాన్‌లో అనేక భారతీయ రెస్టారెంట్లు ఉండటం మా అదృష్టం. అవంటే ఇక్కడి ప్రజలకు చాలా ఇష్టం. నాకైతే చనా మాసాలా, నాన్‌ ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇక్కడ లభించే ‘ఛాయ్‌’ నా భారత పర్యటనల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.’’ అని వెన్‌ తెలిపారు. అంతేకాకుండా చనా మసాలా, నాన్‌, దాల్‌, ఖీర్‌ తదితర పదార్థాలతో నోరూరించేలా ఉన్న సంప్రదాయ భారతీయ భోజన చిత్రాన్ని కూడా ఆమె తన పోస్టుకు జతచేశారు. భారత్‌ ఓ శక్తిమంతమైన, వైవిధ్యమైన దేశమని ప్రశంసించిన తైవాన్‌ అధినేత వెన్‌.. మీకిష్టమైన భారతీయ ఆహారం ఏది అని కూడా నెటిజన్లను ప్రశ్నించటం గమనార్హం.మరిన్ని