కమలా.. భారతీయులు నావైపే: ట్రంప్‌
కమలా.. భారతీయులు నావైపే: ట్రంప్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌తో పోలిస్తే తనకే ఎక్కువ మంది భారతీయుల మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారతీయులకు తానెంతో చేశానని పేర్కొన్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బిడెన్‌ ఎన్నికైతే దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థను రద్దు చేస్తాడని హెచ్చరించారు.

అమెరికాలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌నకు పోటీగా డెమొక్రటిక్‌ పార్టీ నుంచి జో బిడెన్‌ ఎదురునిలిచారు. ఆయనకు డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి వ్యూహాత్మకంగా కమలా హ్యారిన్‌ను ప్రకటించారు. దాంతో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. చట్టసభలకు జరిగే ఎన్నికల్లో చాలాచోట్ల భారతీయులు భారీ ప్రభావం చూపగలరు. ఈ నేపథ్యంలో కమలపై ట్రంప్‌ విమర్శల వర్షం కురిపించారు.

‘ఒకవేళ జో బిడెన్‌ అధ్యక్షుడైతే అమెరికాలో పోలీసు వ్యవస్థను రద్దుచేసే చట్టాన్ని వెంటనే ఆమోదిస్తారు. కమలా హ్యారిస్‌ అయితే మరీ ఘోరం. ఆమెది భారతీయ వారసత్వం. గుర్తుపెట్టుకోండి! ఆమె కన్నా నాకే భారతీయుల మద్దతు ఎక్కువ. ఆమె కన్నా నేనే ఎంతో ఎక్కువ చేశాను వారికి’ అని ట్రంప్‌ అన్నారు. అంతే కాకుండా బిడెన్‌కు పొట్టిపేర్లు పెట్టేందుకు ప్రతిపాదించారు. ‘స్లీపీ జో లేదా స్లో జో’ అనగానే ప్రజలు కేరింతలు కొట్టారు.


మరిన్ని