భారత సంతతి న్యాయమూర్తికి కీలక విచారణ అప్పగింత
 భారత సంతతి న్యాయమూర్తికి కీలక విచారణ అప్పగింత

దశాబ్దాల నాటి కేసులో కీలకం కానున్న తీర్పు

వాషింగ్టన్: అమెరికాలో రెండు దశాబ్దాలుగా నలుగుతున్న కీలక గూగుల్‌ కేసు విచారణలో.. భారతీయ మూలాలున్న అమిత్‌ మెహతా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌పై ఆరోపణలకు సంబంధించి ఆ దేశ న్యాయశాఖ, 11 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌తో సహా  కొలంబియా జిల్లా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసు విచారణను మెహతా చేపట్టనున్నారు.

అమిత్‌ మెహతా గుజరాత్‌లోని పటాన్‌లో జన్మించారు. జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలతో బీఏ పూర్తిచేశారు. అనంతరం 1997లో వర్జీనియా స్కూల్‌ ఆఫ్ లా నుంచి డాక్టరేటు పట్టాను పొందారు. ఆ తర్వాత  ఓ న్యాయ సలహా సంస్థలో కొంత కాలం పనిచేశారు. ఆపై కొలంబియా జిల్లా న్యాయస్థానంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా 2002 నుంచి విధులు నిర్వహించారు.  2014లో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మెహతాను కొలంబియా జిల్లా న్యాయమూర్తిగా నియమించారు.

రు.

Advertisement


మరిన్ని