ఆ కేసు ఛేదిస్తే 5 లక్షల డాలర్లు..
ఆ కేసు ఛేదిస్తే 5 లక్షల డాలర్లు..

మెల్‌బోర్న్‌: ఓ భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు ఆస్ట్రేలియా పోలీసులకు సవాలుగా మారింది. ఆరేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ కేసును ఛేదించేందుకు అవసరమైన సమాచారం అందించిన వారికి.. 5 లక్షల డాలర్లు బహుమానం అందజేస్తామని ఇక్కడి న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రభుత్వం ప్రకటించింది.

2014 జనవరిలో వెస్ట్‌ హోక్స్‌టన్‌ పట్టణం సమీపంలో ఉన్న చిట్టడవిలో ఓ మహిళ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మోనికా చెట్టి అనే ఈ 39 ఏళ్ల  మహిళ ముఖం, శరీరంపై కాలిన గాయాలున్నాయి. ఇవి యాసిడ్‌ వల్ల సంభవించినవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోనికా 28 రోజుల అనంతరం మరణించింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఏ ఆధారం దొరకలేదని.. ఎవరినీ అరెస్టు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహుమానం ప్రకటనతో అయినా ఈ కేసును ఛేదించేందుకు ఆధారం దొరకుతుందని ఆశిస్తున్నట్టు వారు భావిస్తున్నారు.

కాగా, నర్స్‌గా పనిచేసే మోనికా ఓ వీసా కుంబకోణంలో ఇరుక్కుందని.. తన ప్రాణాలకు ప్రమాదముందంటూ ఆమె భయపడేదని స్నేహితులు వెల్లడించారు. ఆరు సంవత్సరాల అనంతరం కూడా నిందితులను గుర్తించకపోవటం పట్ల ఆమె కుమారుడు డేనియల్‌ చెట్టి, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement


మరిన్ని