హారిస్‌ పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు
హారిస్‌ పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు

చెన్నై: అధ్యక్ష ఎన్నికల్లో తమని గెలిపించాలంటూ డెమొక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక పోలింగ్‌ ప్రారంభమవడంతో మరికొన్ని గంటల్లో వారి భవితవ్యం తేలిపోనుంది. మరోవైపు తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామంలో ఆమె గెలుపును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ కుటుంబానిది తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లా మన్నార్‌గుడి తాలూకాకు చెందిన తులసేంద్రపురం. తమ గ్రామం నుంచి వలసవెళ్లిన కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికాలో కీలక స్థానానికి పోటీ పడుతుండడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అయ్యనార్‌(శివుడి అంశల్లో ఒకటి) దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊర్లో ఆమె గెలవాలని కోరుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, గోడపత్రికలు వెలిశాయి.మరిన్ని