ప్రజల సేవకుడిగా నిలిచిన కోడెల 
ప్రజల సేవకుడిగా నిలిచిన కోడెల 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎన్నారై నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెదేపా ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం నేతృత్వంలో బుధవారం జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా, కెనడాకు చెందిన పలువురు తెదేపా ఎన్నారై శ్రేణులు పాల్గొని కోడెలను స్మరించుకున్నారు. పల్నాటి పులిగా, పేదల వైద్యుడిగా, మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా రాణించిన నేత కోడెల అని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కోడెల చేసిన సేవలు, అభివృద్ధి పనులను గుంటూరు ప్రజలే కాదు, ఏపీ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి అభివృద్ధిలోనూ కోడెల కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా దేవినేని గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీకి డాక్టర్‌ కోడెల ఎంతో సేవ చేశారని జయరాం కోమటి అన్నారు. పల్నాడులో రౌడీయిజానికి పాతరేసి అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి కోడెల అని కొనియాడారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు సేవకుడిగా మెలిగారని జయరాం పేర్కొన్నారు. నార్త్‌ కరోలినా రాష్ట్రం, ఫార్లెట్‌ ఎన్నారై తెదేపా సభ్యులు చందు గొర్రెపాటి, నాగ పంచుమర్తి, టాగోర్‌ మల్లినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముసిగింది. 


మరిన్ని