ప్రవాస భారతీయులకు బీమా సేవలు..
ప్రవాస భారతీయులకు బీమా సేవలు..

ఐఎఫ్‌ఎస్‌సీఏ కీలక సిఫార్సులు

దిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయుల బీమా సేవలకు సంబంధించి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ అధారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ)కి చెందిన నిపుణుల కమిటీ కొన్ని ముఖ్య సూచనలు చేసింది. భారతీయ లేదా విదేశీ కరెన్సీలో బీమా చెల్లింపులకు వీలు కల్పించే  జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసేందుకు ప్రవాస భారతీయులు (ఎన్నారై), భారత సంతతికి చెందిన వ్యక్తులను (పీఐఓ) అనుమతించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఐఎఫ్‌ఎస్‌సీఏ భారత్‌లోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సెంటర్లకు సంబంధించిన ఆర్థిక వస్తు సేవలు, సంస్థల నియంత్రణకు ఉద్దేశించిన  సాధికార సంస్థ అనే సంగతి తెలిసిందే.

ఈ మేరకు సంస్థ చైర్‌పర్సన్‌కు నిపుణులు ఓ నివేదికను సమర్పించారు. దీనిలో ఎన్నారైలు, వారి కుటుంబ సభ్యుల కోసం ఐఎఫ్‌ఎస్‌సీ పరిధిలోకి వచ్చే సంస్థల నుంచి బీమా పాలసీలను కొనుగోలుచేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా బీమా వాయిదాలను రూపాయిలలో లేదా ఇతర దేశాల కరెన్సీ.. వారికి అనుకూలమైన రూపంలో చెల్లించేందుకు అనుమతించాలని సూచించింది. ఎన్నారైలు వారిపై ఆధారపడ్డ వారి కోసం ప్రపంచంలో ఎక్కడైనా చికిత్స పొందేందుకు అనుగుణంగా.. విదేశీ ఆరోగ్య బీమాలను తీసుకునే సదుపాయం ఉండాలని తెలిపింది. 

Advertisement

Advertisement


మరిన్ని