విశ్వసాయి ద్వారకామయి ఆధ్వర్యంలో మహామంత్ర జపం
విశ్వసాయి ద్వారకామయి ఆధ్వర్యంలో మహామంత్ర జపం

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ కోసం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశ్వసాయి ద్వారకామయి శక్తిపీఠం ఆధ్వర్యంలో సాయి ఉపాసకులు లక్ష్మోజీ నేతృత్వంలో ‘కోటి శ్రీ షిర్డీ సాయి  గాయత్రి మహామంత్ర జపం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబరు 25 నుంచి డిసెంబరు 29 వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. గత ఆరేళ్లుగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహామంత్రాన్ని  ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వ్యక్తిగతంగా లేదా బృందంగా ఆన్‌లైన్‌ వీడియో చాట్‌ ద్వారా జపించాలని నిర్వాహకులు కోరారు. దేవాలయాల్లో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ మహామంత్రాన్ని 9 సార్లు కానీ, 10,800 సార్లు కానీ యథా శక్తి జపించవచ్చు. ఎన్ని సార్లు జపించారో ఆ సంఖ్యను విశ్వసాయి యాప్‌లోకానీ, అధికారిక వెబ్‌సైట్‌ www.viswasaidwarakamai.orgలో పొందుపరచాలని కోరారు.

ఈ మహామంత్ర జపం కార్యక్రమం జరిగినన్నాళ్లూ తమ శక్తిమేర అన్నదానం చేయాలని నిర్వాహకులు కోరారు.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రోటీ, బిర్యానీ, అన్నం, పులిహోరా, పళ్లు తదితర పదార్థాలను దానం చేయొచ్చని చెప్పారు. ఈ విధంగా ఎంతమందికైతే దానం చేస్తారో ఆసంఖ్యను వెబ్‌సైట్లో పేర్కొనాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం, ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన, ప్రపంచశాంతి సేవ సంస్థ (అమెరికా, కెనడా, ఇండియా)ను సంప్రదించాలన్నారు. ఓం ప్రసాద్‌ : 4088028674 (అమెరికా), ఉమ 6363016252 (భారత్‌), మాధవి 7894359163 (భారత్‌) విశ్వసాయి ద్వారకామాయి 9908049194 నెంబర్లను సంప్రదించవచ్చు.


Advertisement

Advertisement


మరిన్ని