ఎన్నికల వేళ.. అప్రమత్తమైన న్యూయార్క్‌..!
ఎన్నికల వేళ.. అప్రమత్తమైన న్యూయార్క్‌..!

న్యూయార్క్‌: దేశ 46వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకే అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు పది కోట్ల మంది ఓటర్లు ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం నాడు భారీ సంఖ్యలో ఓటర్లు హాజరయ్యే పరిస్థితి ఉండటం, ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఆస్కారం ఉందన్న వార్తల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, ఓటింగ్‌, ఫలితాలు ఆలస్యమైతే నిరసనలు, గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో న్యూయార్క్‌ అధికార యంత్రాంగం అలర్ట్‌గా ఉంది. 

అమెరికాలో జరుగుతున్న వేళ.. న్యూయార్క్‌లోని మన్‌హటన్ వీధితోపాటు నగరం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమయ్యింది. అక్కడ అద్దాలతో ఉన్న లగ్జరీ కార్యాలయాలు, దుకాణాలకు రక్షణ కవచాలుగా కర్రచెక్కలను అడ్డుపెట్టుకుంటున్నారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన అనంతరం జరిగిన నిరసనలు తీవ్రరూపమైన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. 

అప్రమత్తమైన న్యూయార్క్‌..
అమెరికాలో ఎన్నికల వేళ లేదా ఫలితాల సమయంలో నిరసనలు, గొడవలు జరిగే అవకాశముందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో తాజా పరిస్థితులపై పోలీసులతో చర్చించారు. అయితే, గొడవలు జరుగుతాయని ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోన్న మాట వాస్తవమేనని.. కానీ, అంతగా భయపడాల్సిన అవసరం లేదని మేయర్ స్పష్టంచేశారు. అయితే, ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దుకాణదారులు చేసుకుంటున్న జాగ్రత్తలపై మీడియా ప్రశ్నించగా..అది వారి అభీష్టం మేరకేనని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని మేయర్‌ స్పష్టంచేశారు. ఫలితాలు మాత్రం మంగళవారం రాత్రి కానీ, బుధవారం వచ్చే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాల అనంతరం నిరసనకారులు తెలిపితే తప్పులేదని.. కానీ, అవి శాంతియుత వాతావరణంలోనే చేస్తే బాగుంటుందన్నారు.

 

ఇదిలాఉంటే, న్యూయార్క్‌ నగరంలో ఉన్న లగ్జరీ దుకాణాలకు చెక్కలతో ఇలా రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి..

అమెరికా ప్రీ-పోల్స్‌ ఏమంటున్నాయి?

అమెరికాలో ఆ రెండు పార్టీలే ఎందుకు?

Advertisement

Advertisement


మరిన్ని