వేడుకగా ముగిసిన తానా బాలోత్సవం 
వేడుకగా ముగిసిన తానా బాలోత్సవం 

అమెరికా: అరవై రోజుల పాటు సాగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బాలోత్సవం-2020 ముగింపు ఉత్సవాలు నవంబరు 14న ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం కార్యక్రమ రూపకర్త డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, డాక్టర్ జంపాల చౌదరి, తానా కాబోయే అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా బాలోత్సవ కమిటీ, రేఖా ఉప్పలూరి, సునీల్ పాంత్రా, రాజా కసుకుర్తి, సుమంత్ రామిశెట్టి, శ్రీని యలవర్తిని తానా అధ్యక్షులు జయశేఖర్ అభినందించారు. కార్యక్రమంలో కోశాధికారి సతీష్ వేమూరి, దర్శకులు కొరటాల శివ, నాగ్ అశ్విన్, సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి, పద్మశ్రీ శోభారాజు, కూచిపూడి ప్రముఖులు సత్యనారాయణ, ప్రముఖ కూచిపూడి కళాకారిణి జ్యోతి రెడ్ది, హిమాన్సీ కాట్రగడ్డ,గాయకుడు శ్రీక్రిష్ణ, చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ తదితరులు పాల్గొని చిన్నారులకు సందేశమిచ్చారు. తానా బాలోత్సవంలో 2400 చిన్నారులు పాల్గొన్నారు. వీరికి శాస్త్రీయ సంగీతం, తెలుగు పద్యాలు, సినీ నృత్యాలు, సినీ గీతాలు, దేశభక్తి రూపాలు, చిత్రలేఖనం, చదరంగం తదితర 11 విభాగాలలో పోటీలు నిర్వహించారు. మొత్తం 66 మంది చిన్నారులను విజేతలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విజేతలైన వారిని, బాలోత్సవ కమిటీని తానా కార్యవర్గ సభ్యులు అభినందించారు. 

​​


మరిన్ని