విద్యార్థినికి తానా కార్యదర్శి చేయూత
విద్యార్థినికి తానా కార్యదర్శి చేయూత

అనంతపురం: క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురై తిరిగి కోలుకుని డిగ్రీలో చేరిన అనంతపురం విద్యార్థినికి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివాసముంటున్న తానా కార్యదర్శి పొట్లూరి రవి చేయూత అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ చేతుల మీదుగా విద్యార్థికి లాప్‌టాప్‌ అందజేశారు. స్వప్న క్యాన్సర్‌తో బాధపడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ఆమెకు అండగా నిలబడ్డారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో స్వప్న కోలుకుని ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇటీవలే డిగ్రీలో చేరింది. ల్యాప్‌టాప్‌ అందజేసిన అనంతరం పొట్లూరి రవి మాట్లాడుతూ స్వప్న పూర్తిగా కోలుకోవడంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన సహాయం మరువలేనిదని కొనియాడారు. తన మిత్రుడు మొహియుద్దీన్‌ ద్వారా ఎప్పటికప్పుడు స్వప్న ఆరోగ్యంపై తెలుసుకునేవాడినని చెప్పారు. తన వంతు సాయంగా ఇప్పుడు లాప్‌టాప్‌ అందించానని.. భవిష్యత్తులో కూడా ఆమెకు అండగా ఉంటానని పొట్లూరి రవి తెలిపారు.

Advertisement

Advertisement


మరిన్ని