తానా ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ
తానా ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

విజయవాడ: రోడ్డు ప్రయాణాల్లో ద్విచక్రవాహనాల్లో ప్రయాణించేవారి భద్రత కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 2వేల హెల్మెట్లను పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన సుదీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిగురుపాటి విమల నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌ బాబు చేతులమీదుగా హోంగార్డులకు హెల్మెట్లు, రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు మాట్లాడుతూ.. ప్రజాశ్రేయస్సు కోరి తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తానా అధ్యక్షుడు జై తాళ్లూరి, ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా సభ్యులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, తానా సభ్యులు బషీర్ షేక్, కాకాని తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement


మరిన్ని