ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి

తీవ్ర సంతాపం ప్రకటించిన సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీ

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీలో చదువుతున్న హరిశివశంకర్‌ రెడ్డి నాగారం మెదడు సంబంధిత వ్యాధితో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణం పట్ల వర్సిటీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తి చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన హరిశివశంకర్‌ను బ్రిస్బేన్‌లోని ప్రిన్సెస్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ, మెదడులో రక్తస్రావం తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 

యూనివర్సిటీకి చెందిన గోల్డ్‌ కోస్ట్‌ క్యాంపస్‌లో హరిశివశంకర్‌ ఐటీ స్పేషలైజేషన్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఎంతో నిబద్ధత గల విద్యార్థి అని వర్సిటీ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌ మాంటీ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కావాల్సిన సాయం అందిస్తోంది. ఈ వారాంతంలోగా మృతదేహాన్ని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


మరిన్ని