ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థుల నిరసన
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థుల నిరసన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమానికి అధికార వైకాపా మినహా దాదాపు అన్ని పార్టీలూ మద్దతిస్తున్నాయి. ఇతర దేశాల్లోని పలువురు ప్రవాసాంధ్రులు సైతం అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. అనేక చోట్ల ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని తెలుగు విద్యార్థులు నిరసన తెలిపారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై 250 రోజులు పూర్తయిన సందర్భంగా కాన్‌బెర్రాలో పార్లమెంట్‌ హౌస్‌ ముందు జై అమరావతి నినాదాలు చేశారు. రాజధాని విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను కాకుండా.. అభివృద్ధి చెందని ఆఫ్రికా దేశాలను నిదర్శనంగా తీసుకోవడాన్ని వారు తప్పుబట్టారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని