జర్మనీలో విద్యార్థుల వినాయకచవితి వేడుకలు
జర్మనీలో విద్యార్థుల వినాయకచవితి వేడుకలు

జర్మనీ: జర్మనీలోని తెలుగు విద్యార్థులు వినాయకచవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్‌‌ అప్లైడ్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌ చేస్తున్న తెలుగు విద్యార్థులు తమ సహచర కన్నడ, స్థానిక విద్యార్థులతో కలిసి భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు. యూనివర్సిటీ బ్యాక్‌యార్డ్‌లోని మట్టి తీసుకొచ్చి పర్యావరణ హిత వినాయక స్వామి ప్రతిమను రూపొందించారు. విశ్వవిద్యాలయ పరిసరాల్లో లభించిన పత్రి, పూలతో గణనాథుడిని అలంకరించారు. ప్రసాదాలు తయారు చేసుకుని, యూట్యూబ్‌లో చూస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జె. పవన్‌ శాస్త్రి, ముసునూరు వెంకట్‌, కె.శశిధర్‌, విశాల్‌ అశోక్‌ హెగ్దే, ధనుష్‌, పృధ్వీ, జర్మనీ విద్యార్థి జూలి ఈ వేడుకలో పాల్గొన్నారు.


మరిన్ని