ఏప్రిల్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్‌: ట్రంప్‌
ఏప్రిల్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్‌: ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులందరికీ సరిపడా వ్యాక్సిన్‌ డోసులు ఏప్రిల్‌ 2021 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ‘‘వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తాం. ఏప్రిల్‌ 2021 నాటికి అందరికీ సరిపడా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం’’ అని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్‌ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్‌ తెలిపారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు అనేక రకాల ఆంక్షలకు సైతం టీకా చెక్ పెట్టనుందన్నారు. సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తిని ఇప్పటికే భారీ ఎత్తున ప్రారంభించామన్నారు.

Advertisement


మరిన్ని