మోదీ గొప్ప నేత: ట్రంప్‌
మోదీ గొప్ప నేత: ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ‘గొప్ప నేత’గా అభివర్ణించారు. విశ్వసించదగిన నాయకుడంటూ ప్రశంసలు గుప్పించారు. గురువారం మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ట్రంప్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప నేత, విశ్వాసం గల నాయకుడైన ఆయన మరెన్నో పుట్టినరోజులు జరపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ‘సమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో మోదీతో కలిసి అభివాదం చేస్తున్న చిత్రాన్ని ట్వీట్‌కు జత చేయడం విశేషం. 

ఇదీ చదవండి..
70వ వసంతంలోకి ప్రధాని మోదీమరిన్ని