తెలుగులో అమెరికా జనగణన సమాచారం
తెలుగులో అమెరికా జనగణన సమాచారం

హైదరాబాద్‌: అమెరికాలో పదేళ్లకోమారు నిర్వహించే జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజలకు ఇచ్చే మార్గదర్శక సమాచారాన్ని 59 భాషల్లో రూపొందించారు. ఇందులో తెలుగుతోపాటు 7 భారతీయ భాషలకూ చోటుకల్పించారు. జనగణనలో పాల్గొనడానికి ఏమేం చేయాలి? ఎలా సమాచారం ఇవ్వాలి? అనే అంశాలన్నీ ఈ భాషల్లో చదువుకోవచ్చు. వీడియో చిత్రాలు సైతం ఆయా భాషల్లో రూపొందించారు. వీటిని వెబ్‌సైట్‌ (https://2020census.gov/en.html)లో పొందుపరిచారు.

ఎక్కువ మంది మాట్లాడే భాషలను ఇందుకు ఎంపిక చేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. తెలుగుతోపాటు బెంగాలీ, గుజరాతీ, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీల్లో ఈ సమాచారం రూపొందించారు. అయితే, ఈ సమాచారం ఆధారంగా ప్రజల్ని అడిగే ప్రశ్నావళిని మాత్రం 13 భాషల్లో మాత్రమే సిద్ధంచేశారు. ఈ ప్రశ్నావళి తెలుగులో లేదు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమెరికాలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. మనదేశంలో జనగణన రెండు దశలుగా జరుగుతుంది. తొలిదశలో 2020 ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఇళ్లు, కట్టడాల లెక్కలు, కుటుంబాల వివరాలను సేకరిస్తారు. తుది దశ కింద 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి పౌరుడి సమాచారం తీసుకుంటారు. కానీ, అమెరికాలో ఒకే దశ కింద 2020 ఏప్రిల్‌ నుంచి సమాచారమంతా సేకరిస్తారు.మరిన్ని