ట్రంప్‌నకు రెమ్‌డెసివిర్‌ రెండో డోసు!
ట్రంప్‌నకు రెమ్‌డెసివిర్‌ రెండో డోసు!

వాషింగ్టన్‌: కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రెమ్‌డెసివిర్‌ రెండో డోసు పూర్తయ్యిందని వైద్యులు వెల్లడించారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం పనితీరు సాధారణ స్థితికి వచ్చినట్లు వారు తెలిపారు. ట్రంప్‌ను సోమవారం శ్వేతసౌధానికి పంపే అవకాశం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా తన ఆరోగ్యం మెరుగవుతోందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ట్విటర్‌ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘నా ఆరోగ్యం మెరుగుపడుతోంది. త్వరలోనే కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని ఎన్నికల ప్రచారంలోకి వస్తాను. అమెరికాను గొప్ప దేశంగా నిలిపేందుకు మరిన్ని అడుగులు వేయాల్సి ఉంది. రాబోయే కొన్ని రోజులే అసలు పరీక్ష. ఏం జరుగుతుందో చూడాలి. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా కోలుకుంటున్నారు’’ అని ట్విటర్‌లో ట్రంప్‌ వెల్లడించారు.
 

Advertisement

Tags :

మరిన్ని