పేద విద్యార్థులకు వల్లేపల్లి కుటుంబం చేయూత
పేద విద్యార్థులకు వల్లేపల్లి కుటుంబం చేయూత

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేదరికంతో ఇబ్బందులు పడుతున్నవారికి చేయూత అందించడంలో ఆనందం వెతుక్కొనేవారు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినదే శశికాంత్ వల్లేపల్లి-ప్రియాంక వల్లేపల్లి కుటుంబం కూడా. సామాజిక సేవలో ముందుంటోన్న ఈ కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. చదువుకోవాలన్న తపన ఉండే విద్యార్థులకు ఆర్థిక కారణాలు అడ్డంకిగా మారకూడదనే సదుద్దేశంతో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని వందల మందికి స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.

ఈ ఏడాది కూడా తూర్పుగోదావరి జిల్లాలో 40 మంది విద్యార్థులకు  ఆర్థిక సాయం అందించారు. తాజాగా కాకినాడలోని మహర్షి  సాంబమూర్తి సంస్థ ప్రాంగణంలో పడాల ఛారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధులు ‘తానా చేయూత’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా డీఐజీ మోహన్ రావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి హాజరయ్యారు. 'తానా'లాంటి సంస్థల కారణంగా వందలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు అవసరమైన సాయాన్ని పొందుతున్నారన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు జై తాళ్లూరి, నిరంజన్‌తో పాటు ఇతర సభ్యులు పర్యవేక్షించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని