మృదు మధురంగా అన్నమయ్య శతగళార్చన
మృదు మధురంగా అన్నమయ్య శతగళార్చన

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యములో అన్నమయ్య శతగళార్చనను ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్‌ వేదికగా మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో సప్తగిరి సంకీర్తనలు, పిల్లలు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అలరించాయి. ఎంపిక చేసిన 25మంది చిన్నారులతో పాటు, 180 మందికి పైగా పాడిన 7 సప్తగిరి సంకీర్తనలను శతగళార్చనగా కూర్చి, వాటిని ఈ కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. సింగపూర్, భారత్‌, అమెరికా, యూకే, మలేషియా తదితర దేశాల నుంచి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్నారులు మౌర్య, శ్రియలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా,  భాగవత ప్రచార సమితి వ్యవస్థాపకులు ఊలపల్లి సాంబశివరావు అన్నమయ్య ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, రామాంజనేయులు చమిరాజు తదితరులు చిన్నారులను ప్రోత్సహించారు. అంతర్జాలం వేదికగా అన్నమయ్య శతగళార్చన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని), వీడియో ఎడిటింగ్ చేసిన Aquar Works (రాజేష్, వి.ఎం. మూర్తి) ఆడియో సహకారం అందించిన జ్యోత్స్న శ్రీకాంత్ (వయోలిన్), అభిషేక్ ఎం (మృదంగం), శరత్ శ్రీనివాస్ (మిక్సింగ్) తదితరులకు భాగవత ప్రచార సమితి తరపున హృదయ పూర్వక తెలిపారు. సురేష్ చివుకుల, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతులకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని