అమ‌రావ‌తి  రైతులకు బే ఏరియా ఎన్నారైల ఆర్థిక దన్ను!
అమ‌రావ‌తి  రైతులకు బే ఏరియా ఎన్నారైల ఆర్థిక దన్ను!

అమెరికా: మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు సుదీర్ఘంగా కొనసాగిస్తున్న పోరాటానికి ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలుపుతున్నారు. అంతేకాకుండా కర్షకుల ఉద్యమానికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. నవ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకునేందుకు రైతులు చేస్తున్న అవిశ్రాంత ఉద్య‌మానికి ప్ర‌వాసాంధ్రుల నుంచి అప్ర‌తిహ‌త ఆప‌న్న హ‌స్తం అందుతోంది. అన్న‌దాత‌ల ఉద్య‌మానికి 'మ‌నం సైతం`అనే నినాదంతో జ‌య‌రాం కోమ‌టి అమెరికాలోని ప్ర‌వాసాంధ్రుల్లో చైత‌న్యం ర‌గిలించారు. దీంతో 'బే ఏరియా'కు చెందిన వెంక‌ట్ కోగంటి, కృష్ణ గొంప, భ‌క్తా భ‌ల్లా, ర‌జ‌నీకాంత్ కాక‌రాల‌ స‌మ‌ష్టిగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రైత‌న్న‌ల ఉద్య‌మానికి ఆర్థికంగా సాయం చేయాల‌ని సంక‌ల్పించుకున్నారు. ఈ క్ర‌మంలో తొలి విడ‌త‌లో 30,014 డాల‌ర్ల‌ను సేక‌రించారు. ఈ మొత్తాన్ని `ఎన్నారైస్ ఫ‌ర్ అమ‌రావ‌తి` కోశాధికారికి చెక్కు రూపంలో అందజేశారు. అంతేకాదు, మ‌రో 15 వేల డాలర్ల‌ను సేక‌రించి, రైత‌న్న‌ల ఉద్య‌మానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్ర‌తిజ్ఞ చేశారు. ఈ నేప‌థ్యంలో నిధుల సేక‌రణ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. తమకు అండగా నిలిచిన 'బే ఏరియా' ఎన్నారైల'కు అమరావతి రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Advertisement

ఇవీ చదవండి

Advertisement


మరిన్ని