గల్ఫ్‌లో ఘనంగా భాగవత పద్యాల పోటీలు
గల్ఫ్‌లో ఘనంగా భాగవత పద్యాల పోటీలు

యూఏఈ: రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీలు గల్ఫ్ దేశాలైన కువైట్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్‌, ఓమన్ దేశాల్లో ఘనంగా జరిగాయి. చిన్నారులకు ఐబాం వారి ఆధ్వర్యంలో గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య సంయుక్త నిర్వహణలో జులై 23, 24 తేదీల్లో వీటిని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాకుడు కుదరవల్లి సుధాకరరావు తెలియజేశారు. నూట నలభై మంది పిల్లలకు పైగా పాల్గొన్న ఈ పొటీలలో న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు పండితులు వ్యవహరించారు.

పూర్తిగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమములో తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్, తెలుగు కళా సమితి కువైట్, తెలుగు కళా సమితి బహ్రెయిన్‌, తెలుగు కళా సమితి ఓమన్, ఆంధ్ర కళా వేదిక ఖతార్, తెలుగు కళా సమితి ఖతార్, తెలుగు తరంగిణి యూఏఈ, సౌదీ తెలుగు అసోసియేషన్, యూఏఈ తెలుగు అసోసియేషన్ కలిసి పనిచేశాయి. విజేతల ప్రకటన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, ఐబాం గ్లోబల్ కో-ఆర్డినేటర్ రమేష్ పాల్గొని విజేతలను ప్రకటించారు.

కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ.. ఇంతటి చక్కని కార్యక్రమానికి అవకాశం కల్పించిన ఐబాం సంస్థ అధ్యక్షులు మల్లిక్ పుచ్చాకి, న్యాయ నిర్ణేతలకు, ముఖ్య అతిథులు భువనచంద్ర, వంశీ రామ రాజు,  గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు, నిర్వాహకులకు, సాంకేతిక సహకారం అందించిన సుఖవాసి విక్రంకు, మిడిల్ ఈస్ట్  కోఆర్డినేటర్స్ లలిత, కల్యాణికి  ధన్యవాదాలు తెలియచేశారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని