మరో భారత సంతతి మహిళకు కీలక పదవి
మరో భారత సంతతి మహిళకు కీలక పదవి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అధికారిక యంత్రాంగంలో మరో భారత సంతతి మహిళకు చోటుదక్కింది. అమెరికా పాలసీ కౌన్సిల్‌లో కార్మిక, ఉద్యోగ విభాగాలకు సంబంధించి జో బైడెన్‌ ప్రత్యేక సహాయకురాలిగా భారతీయ అమెరికన్‌ ప్రొనీతా గుప్తాను ఎంపిక చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు ప్రొనీత సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ సోషల్‌ పాలసీలో జాబ్‌ క్వాలిటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. తక్కువ వేతనంతో పనిచేసే కుటుంబాలకు పని భద్రత, ఆర్థిక భద్రతను కల్పించేందుకు ఆమె విశేష కృషి చేశారు. 

అమెరికా పురోగతి కోసం బైడెన్‌ అజెండాను అమలు చేసేందుకు ప్రొనీతా గుప్తాను మించినవారు లేరని సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ సోషల్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒలీవియా గోల్డెన్‌ పేర్కొన్నారు. ఒబామా హయాంలో 2014 ఏప్రిల్‌ నుంచి 2017 జనవరి వరకు అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ మహిళా బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రొనీత విధులు నిర్వహించారు. ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో కీలక పదవికి ఆమెను ఎంపిక చేశారు.మరిన్ని