అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక 
అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక 

 కరోనాతో నష్టపోయిన వర్గాలకు ఊరట

వాషింగ్టన్‌: కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్‌ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడంతో వారిని ఆదుకోవడానికి వివిధ చర్యలు చేపడూ ‘అమెరికన్‌ ఆపద రక్షక ప్రణాళిక’ను రూపొందించారు. అందులో భాగంగా...

> ప్రతి నిరుద్యోగికి 2,000 డాలర్లు (రూ.1.40 లక్షలు) ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. ఇప్పటికే 600 డాలర్లు ఇవ్వగా, మిగిలిందీ వెంటనే అందివ్వనున్నారు.

> నిరుద్యోగ బీమా కింద ఇస్తున్న సౌకర్యాల కాలపరిమితిని మరికొంతకాలం పాటు పెంచనున్నారు. 

>  అద్దెలు చెల్లించలేక చాలా మంది ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తుండడంతో అలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

> చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం అందించనున్నారు.

> దారిద్య్ర రేఖకు దిగువున లేకుండా చూడడం కోసం ప్రతి వారికి కనీస వేతనం కింద గంటకు 15 డాలర్లు (సుమారు రూ.1,050) చెల్లించాలి. వారానికి 40 గంటలకు మించి పనిచేయాల్సిన అవసరం లేదు. 

అంతర్గత తీవ్రవాదంపై సమీక్ష

దేశంలో తలెత్తిన అంతర్గత తీవ్రవాదంపై బెడెన్‌ వివిధ భద్రత విభాగాలతో సమీక్షించనున్నారు. వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్, అంతర్గత భద్రత విభాగాలను ఆదేశించారు.  

తాలిబన్ల ఒప్పందంపైనా...

తాలిబన్లతో కుదిరిన ఒప్పందంపైనా సమీక్ష జరగనుంది. ఒప్పందాన్ని అనుసరించి అఫ్గానిస్థాన్‌లో హింసాత్మక చర్యలను తగ్గించిందీ లేనిదీ పరిశీలించనున్నారు. 

రక్షణ మంత్రి నియామకానికి ఆమోదం

రక్షణ మంత్రిగా రిటైర్డ్‌ జనరల్‌ లాయిడ్‌ ఆస్టిన్‌ నియామకానికి సెనేట్‌ 93-2 మెజార్టీతో ఆమోదించింది. అంతకుముందు దిగువ సభ 326-78 మెజార్టీతో అంగీకారం తెలిపింది. ఈ పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయుడు ఆయనే కావడం విశేషం. 

ఇవీ చదవండి...

అట్టుడుకుతున్న రష్యా!

అంటార్కిటికాలో భారీ భూకంపం!

Advertisement


మరిన్ని