సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్‌: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈ నెల 24న రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక హెల్త్‌ సర్వీసెస్‌ అథారిటీ సింగపూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఈ కార్యక్రమం నిర్వహించగా, స్థానికంగా ఉన్న 125 మంది తెలుగువారు స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేశారు. గతేడాది కరోనా కష్ట కాలంలోనూ జులై 11, అక్టోబరు 11న కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా రక్తదాన కార్యక్రమాలను చేపట్టినట్లు నిర్వాహకులు మేరువ కాశయ్య తెలిపారు. గతసారి కంటే యువతతోపాటు ఇతరులు 25 మంది అధికంగా పాల్గొన్నారని చెప్పారు. తరువాత నిర్వహించే కార్యక్రమంలో దాతలు RO284 కోడ్‌ను ఉపయోగించి రక్తదానం చేయాలని కాశయ్య తెలిపారు. తదుపరి రక్తదాన కార్యక్రమాన్ని మేడే సందర్భంగా నిర్వహించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న రక్త దాతలకు సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు.


 

Advertisement


మరిన్ని